వరంగల్ మహా;
కొండా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజు ఆధ్వర్యంలో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పెళ్లి రోజు వేడుకలు కొండా అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. తొలిత వరంగల్ బట్టల బజార్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తూర్పు కాంగ్రెస్ నేతలు కొండా దంపతుల పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి వరంగల్ చౌరస్తాలో భారీ కేక్ కట్ చేసి పేద మహిళలకు కుట్టు మిషిన్ల పంపిణీ తో పాటు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు సుమారు 900 మందికి బట్టలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని గోపాల నవీన్ రాజు, మీసాల ప్రకాష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపాల నవీన్ రాజ్ మాట్లాడుతూ కొండా దంపతుల పెళ్లిరోజు సందర్భంగా వారు
నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాగే ప్రజా పాలనలో ప్రజలకు సేవలు అందిస్తూ
కొండా దంపతుల నాయకత్వంలో రాష్ట్రంలోనే వరంగల్ తూర్పు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి కార్యదర్శి మీసాల ప్రకాష్, కొత్తపల్లి శ్రీనివాస్, జారతి రమేష్ ,కత్తెర శాల వేణుగోపాల్, మడిపల్లి కృష్ణ గౌడ్, కోడం శివకృష్ణ , మోసిన్, భాషపాక సదానందం, తోట వేణు, కురిమిళ్ళ సంపత్, మబ్బు ప్రవీణ్, కూరగాయల మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షులు జారతి శ్రీనివాస్, కత్తెరసాల శ్రీధర్ , కార్పొరేటర్లు బస్వరాజు కుమార్ స్వామి, గుండు చందన పూర్ణచందర్, ముష్కమల్ల అరుణ సుధాకర్, భోగి సువర్ణ సురేష్, వస్కుల బాబు, బాల్నే సురేష్ ,మాజీ కార్పొరేటర్లు కెడల పద్మ బాసాని శ్రీనివాస్, ఎలగం సత్యనారాయణ, మహిళా నాయకురాలు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు








