Mahaa Daily Exclusive

  ప్రో. జయశంకర్ సర్ పై అభిమానంతో….!

Share

జగిత్యాల, మహా:

తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సారు పై అభిమానాన్ని చాటుకున్న సంఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే జగిత్యాల పట్టణంలోనీ ఎస్.కే.ఎన్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ముందు గల తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సారు కండ్ల జోడు కొందరు పోకిరీలు తొలగించగా ఇది గమనించి పట్టణంలో వెల్డింగ్ షాప్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న కల్లెడ గ్రామానికి చెందిన రాళ్ళబండి ప్రసాద్ అభిమానంతో కండ్ల జోడు తయారు చేసి విగ్రహానికి గురువారం అమర్చాడు. ఈ సందర్భంగా ప్రసాద్ ను విగ్రహ వ్యవస్థాపకులు, హైకోర్టు న్యాయవాది కూర్మాచలం ఉమా మహేష్ అభినందించారు.