రంగారెడ్డి జిల్లా మహా:
మాల్ గ్రామంలో నిరుపేద దళిత కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు, యాచారం మండలం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బట్టు శ్రీనివాస్ ముదిరాజ్, 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. రంగారెడ్డి జిల్లా, యాచారం మండలంలోని, మాల్ గ్రామానికి చెందిన గుడుగుంట్ల సునీత రమేష్, నిర్మల కుమార్, పద్మా రాములు, వస్కుల అండాలు రాములు, ముదిగొండ మంజుల రామచంద్రి కుటుంబాలకు చెందిన వారి ఆడబిడ్డల వివాహాలకు పదివేల చొప్పున 50వేల రూపాయల ఆర్థిక సాయం బట్టు శ్రీనివాస్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నిరుపేదలైన ఆడబిడ్డల వివాహాలకు పెళ్ళికానుక అందించడం జరిగిందని, ఈ ఆర్థిక సాయం చేయడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. మాల్ గ్రామంలో ఎవరికి ఆపద వచ్చిన తాను ముందుంటానని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ తమ వంతు కృషి తప్పకుండా చేస్తానని ఆయన అభిప్రాయాన్ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా, తన వంతు బాధ్యతగా పనిచేస్తాన ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిన్నోళ్ల పద్మజ జహంగీర్ మాజీ వార్డు సభ్యులు గొల్లపల్లి వెంకటేష్, చిన్నోళ్ల వెంకటయ్య విహెచ్ పిసి అధ్యక్షులు డేరంగుల ఈశ్వర్ నాయకులు కప్పాటి యాదయ్య గుడుగుంట్ల రాములు గుడుగుంట్ల కృష్ణ, గుడుగుంట్ల కుమార్, చిన్నోళ్ల బుచ్చయ్య, కలకొండ పర్వతాలు, కంబాలపల్లి సాయిలు, జాపాల రాములు, ఎర్రం సోమయ్య, జాపాల కృష్ణయ్య, కొప్పుల వెంకటేష్, మిద్దె పెద్ద జంగయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.








