Mahaa Daily Exclusive

  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గొడవ బీజేపీ యువ నాయకుల ఘర్షణ ..!

Share

ఆదిలాబాద్, మహా:

ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంప్ కార్యాలయంలో పార్టీ యువ నాయకుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇటీవల బీజేపీ పార్టీ నాయకుల మధ్య నెలకొన్న రాజకీయ, ఇతరత్రా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే తనయుడు పాయల్ శరత్ (బన్నీ), గండ్రత్ మహేందర్ ఇద్దరు యువ నాయకుల మధ్య జరిగిన తోపులాటలో మహేందర్ కు స్వల్ప గాయాలైయ్యాయి. దీంతో ఇతర నేతలు ఇద్దరి ని నిలువరించినట్లు తెలిసింది.