Mahaa Daily Exclusive

  బల్దియా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన చాహాత్ బాజ్ పేయి కమీషనర్ కు శుభాకాంక్షలు తెలిపిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది హనుమకొండ, వరంగల్ కలెక్టర్లను కలిసిన కమిషనర్ ..!

Share

వరంగల్ మహా;

బల్దియా నూతన కమిషనర్ గా చాహాత్ బాజ్ పయ్ శుక్రవారం ప్రధాన కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని, కరీంనగర్ లో మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఉందని మున్సిపల్ సర్వీసుల పై అవగాహన ఉందని స్పష్టంచేసిన కమిషనర్ సానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించి నగర పరిశుభ్రతకు తోడ్పడడం తో పాటు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే లక్ష్యం అలాగే భవన నిర్మాణ అనుమతులకు జారీ చేసే విధానాన్ని, శానిటేషన్ విభాగం లో విధులు నిర్వహించే సిబ్బంది సంఖ్య చెత్త తరలింపు జరిపే వాహనాలకు జీ పి ఎస్ అనుసంధానం , తదితర అంశాలను సంబంధిత విభాగాల అధికారులకు అడిగి తెలుసుకున్నారు.
అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సహకారం తో నగర అభివృద్ది కి కృషి చేస్తానని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు.
అనంతరం బల్దియా లోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు సిబ్బంది కమిషనర్ కు పుష్పగుచ్చాలు, పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో డిప్యూటీ కమిషనర్ (అడ్మిన్)రాజేశ్వర్, సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి, ఇంచార్జి ఎస్ ఈ ,సిటీ ప్లానర్ లు శ్రీనివాస్, రవీందర్ రాడేకర్,
పి ఆర్ ఓ ఆయుబ్ అలీ,డిప్యూటీ కమిషనర్లు రవీందర్, ప్రసన్న రాణి,ఈ ఈ లు, డి ఈ లు,ఆర్ ఓ లు, ఆర్ ఐ లు, తదితరులు, ఉన్నారు.

తదనంతరం..
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయి హన్మకొండ, వరంగల్ జిల్లా ల కలెక్టర్లు పి.ప్రావిణ్య, డా.సత్య శారద లను ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్లు కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు.