వరంగల్ మహా;
మద్యానికి అలవాటు పడి, జల్సాలకు అవసరమైన డబ్బు కొసం మేనత్తను అతి దారుణంగా హత్యచేసి ఒంటి మీద ఉన్న నగలను చోరీ చేసిన మేనల్లుడిని గీసుగొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. నిందితుడి నుండి పోలీసులు 18లక్షల విలువగల సుమారు 170గ్రాముల బంగారు, 34గ్రాముల వెండి అభరణాలతో పాటు పదివేల రూపాయల నగదు, ద్విచక్రవాహనం, ఒక సెల్‌ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు రేకులపెల్లి ప్రణయ్ వయస్సు 23, రాజీవ్‌కాలనీ,మట్వాడా,వరంగల్ జిల్లాకు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.
ఈ అరెస్టుకు సంబందించి ఈస్ట్‌జోన్ డిసిపి అంకిత్ కుమార్ వివరాలను వెల్లడిస్తూ, ఈ నెల 7వ తారీఖున గీసుగొండ మండలం, స్థంబాలపల్లి గ్రామానికి చెందిన కొచన స్వరూప వయస్సు 70 సంవత్సరాల వృద్దురాలిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లుగా మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అదేశాల మేరకు ఈస్ట్‌జోన్ డిసిపి అధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన గీసుగొండ పోలీసులు ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్న టెక్నాలజీని వినియోగించుకోని వృద్దురాలని దారుణంగా హత్య చేసింది మృతురాలి మేనల్లుడు వరంగల్ మట్టెవాడ ప్రాంతం, రాజీవ్ కాలనీలో నివాసం ఉండే రేకులపెల్లి ప్రణయ్ గా పోలీసుల దర్యాప్తులో నిర్థారణ కావడంతో పోలీసులు నిందితుడిని శుక్రవారం ఉదయం అరెస్టు చేసి గీసుగొండ పోలీస్ స్టేషన్ తరలించి విచారించగా నిందితుడు హత్య చేసిన నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు.
నిందితుడిని పట్టుకొవడం ప్రతిభ కబరిచన గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేందర్, టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బందిని డిసిపి అభినందించారు.








