రంగారెడ్డి జిల్లా మహా:
సరూర్ నగర్ మండలం సిరిపురం కాలనీకి చెందిన అంతటి వికాస్ గౌడ్, జెల్ పల్లి మున్సిపాలిటీలోని 2బి బార్ ను డ్రాలో గెలుపొందడం జరిగింది. సరూర్ నగర్ కార్యాలయంలో జిల్లా మధ్య నిషేధ ఆబ్కారీ అధీక్షకుల ఆధ్వర్యంలో జెల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని, 2బి బార్ కొరకు డ్రా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఎక్సైజ్ (గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ ఆఫ్ సెల్లింగ్ బై బార్ అండ్ కండిషన్స్ ఆఫ్ లైసెన్స్) రూల్స్ 2005 ప్రకారం నాన్ ఎస్టాబ్లిషెడ్ అయినటువంటి జల్పల్లి మున్సిపాలిటీ పరిదిలో (O1) 2B బార్ కొరకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా మద్య నిషేధ మరియు ఆబ్కారి అధికారి కార్యాలయంలో జిల్లా డిఆర్ఓ సంగీత డ్రాలో 029 నెంబర్ను తీయడం జరిగింది. ఇట్టి డ్రాలో అంతటి వికాస్ గౌడ్ కు సంబంధించిన టోకెన్ రావడం జరిగింది.
Post Views: 29








