వరంగల్ మహా;
వర్షాకాలం జిల్లాలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ (సీజనల్ వ్యాధులు) ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వర్షాకాలం నేపధ్యంలో సీజనల్ వ్యాధులు నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల పై పీపీటీ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సన్నద్ధం కావాలన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డులో మీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇండ్లలో ఉన్న నీటి నిల్వలను గుర్తించి మాపింగ్ చేసి, నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు.
ప్రతి మంగళ, శుక్ర వారాలలో డ్రైడే కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. వాటర్ లాగిన్ పాయింట్ల ఆయిల్ బాల్, గంబుషియా చేపలు వేయాలన్నారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ద వహించాలని, అధికంగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యల పై గ్రామసభలలో సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొవాలని, ముఖ్యంగా పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి అనుమానితుల నుండి రక్తనమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డెంగ్యూ రాపిడ్ టెస్టులు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లావ్యాప్తంగా కూలిపోయే స్థితిలో ఉన్న పాడైపోయిన భవనాలు, పాతబడిన భవనాలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, డిఆర్డీఓ కౌసల్య దేవి , జెడ్పి సీఈఓ రామిరెడ్డి,జిల్లా మలేరియా అధికారి రజిని, డిబిసిడిఓ పుష్పలత, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, వైద్య అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గిరిజన గ్రామాల్లో స్పెషల్ క్యాంపులు
జిల్లాలో గిరిజనులకు ప్రభుత్వ సౌకర్యాలు కల్పించుటకు జూన్ 15 నుండి 30 వరకు గిరిజన గ్రామాల్లో స్పెషల్ క్యాంపులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా కలెక్టరేట్ లో ప్రధానమంత్రి జన జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ (పీఏం జనమన్,) నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఏం జన్ మాన్ (ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ్ మహా అభియాన్), డి.ఏ.జే.జి.యూ.ఏ ( దరతి ఆభా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్) కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు.
జిల్లాలో గిరిజనులు అధికంగా ఉన్న 15 మండలాల తోపాటు
ఆయా గ్రామాల్లో ప్రజలందరికీ తప్పనిసరిగా ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆయుష్మాన్ కార్డ్, రేషన్ కార్డు కిసాన్ కార్డు, ఇతర సదుపాయాలను కల్పించాల్సి ఉంటుందని అన్నారు. ప్రజలందరికీ ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం అందించేందుకు అవసరమైన మీసేవ నెంటర్ తో సహా సంబంధిత గ్రామాలలో జూన్ 15 నుండి జూన్ 30వ తేదీ వరకు క్యాంప్ ఏర్పాటు చేయాలని, అర్హులకు ఎవరికైనా రేషన్ కార్డు లేని పక్షంలో వారిచే దరఖాస్తు చేయించాలని కలెక్టర్ సూచించారు.
గ్రామాలలో అంగన్ వాడి కేంద్రాలలో టీచర్ హెల్పర్ అందుబాటులో ఉన్నారా లేదా పరిశీలించాలని ” లేనిపక్షంలో ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని అన్నారు. 6 సంవత్సరాల లోపు గల పిల్లలకు పౌష్టికాహారం అందుతుందో డబుల్ చేక్ చేయాలని అన్నారు. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమం క్రింద 100 శాతం టీకాలు వేయించాలని 102 వాహనాల వినియోగం పరిశీలించాలని అన్నారు. దివ్యాంగులకు యూ.డి.ఐ.డి నెంబర్ వచ్చేలా చూడాలని అన్నారు. ప్రజలందరికీ జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరవాలని, పీఎం విశ్వకర్మ ముద్ర స్టాండప్ ఇండియా వంటి వివిధ పథకాల కింద స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ లీడ్ బ్యాంక్ మేనేజర్ కు సూచించారు. 100 రోజుల ఉపాధి హామీ పని అమలు తీరు పరిశీలించాలని, జాబ్ కార్డులు లేని అర్హులకు కార్డు లు జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సౌజన్య , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, డిఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీవో లు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కాకతీయ మెగా టెక్సటైల్ పార్క్ సందర్శన
రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్,
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్
వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం కాకతీయ మెగా టెక్సటైల్ పార్క్ సందర్శించారు.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పర్యటనలో భాగంగా గణేశ ఈకోటెక్, యంగ్ వన్, కంపెనీలలో పారిశ్రామిక ఉత్పత్తులను పరిశీలించి, కైటెక్స్ కంపెనీలో నిర్వహిస్తున్న ట్రయల్ రన్ పరిశీలించారు.
ఆంజిమ్ గీసుగొండ శివారులో టెక్స్టైల్ పార్కులో వరద ముంపు నివారణకు నిర్మించనున్న నదీనాల ప్రాంతాన్ని పరిశీలించి 100 మీటర్ల వెడల్పుతో చేపట్టనున్న రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని టెక్నికల్ గా ఎంతవరకు తగ్గించవచ్చో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటులో భూములు కోల్పోయిన 863 భూ నిర్వాసితులకు ప్లాట్ల కోసం అభివృద్ధి చేసిన రాజివ్ మెగా లేఔట్ టౌన్షిప్ లో పురోగతిలో ఉన్న ప్రాథమిక మౌలిక సదుపాయాలు, అంతర్గత రహదారులు, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్, మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. వెంటనే లేఅవుట్ మంజూరు చేసి ప్లాట్లు కేటాయించిన వారికి రిజిస్ట్రేషన్లు చేయించాలని ఈ సందర్భంగా కుడా అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో
టిజిఐఐసి చీఫ్ ఇంజనీర్ రవి, జోనల్ మేనేజర్ అజ్మీర స్వామి, ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి, తహసిల్దారులు రాజ్ కుమార్, యాజుద్దీన్, తదితరులు, పాల్గొన్నారు.








