Mahaa Daily Exclusive

  ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య… విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం.. తలకొండపల్లి ఎంఈఓ చాంప్లా నాయక్..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహ:
వెల్జాల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు దుస్తులు అందజేసిన ఎంఈఓ చాంప్ల నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెర్ల వెంకట్ రెడ్డి అందజేశారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని ఎవరైనా ఏదైనా సాధించాలనుకుంటే అది చదువుతో మాత్రమే సాధ్యమవుతుందని తలకొండపల్లి ఎంఈఓ చాంప్లా నాయక్ అన్నారు. గురువారం నుండి ప్రభుత్వ బడులు తెరుచుకున్న సందర్భంలో, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం, వెల్జాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, నోట్ పుస్తకాలను ఎంఈఓ స్థానిక నాయకులతో కలిసి విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెర్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య పైన ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పాఠశాల తరగతి గదులు తెరుచుకోకముందే పాఠశాలకు విద్యార్థులు చదువుకునే పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు, విద్యార్థినీ విద్యార్థులకు దుస్తులను పాఠశాలకు చేర్చిందని, ఇది విద్యపై కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన ప్రత్యేక దృష్టికి నిదర్శనమన్నారు. హైదరాబాదు లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా మన మండలంలోని ఇంటిగ్రేట్ పాఠశాల రావడం గొప్ప వరంగా భావించాలి అన్నారు. ఇక విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు పోవద్దని, అప్పులు చేసి ఇబ్బందులు పడకూడదని, ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యను అందిస్తున్నారని, కాబట్టి ప్రైవేటు పాఠశాలలో పది అక్షరాలు నేర్చుకున్న అంతే, ప్రభుత్వ పాఠశాలలో రెండు అక్షరాలు నేర్చుకున్న దానితో సమానమని, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం, కావాల్సిన మౌలిక వసతులను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని, రానున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే పోటీతత్వం ఉంటుందని, ప్రైవేటు పాఠశాలల వైపు కన్నెత్తి చూడకుండా ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్, మాజీ జెడ్పి కోఆప్షన్ సభ్యులు ముజీబూర్ రహమాన్, మాజీ ఎంపీటీసీలు జి శ్రీనివాసమూర్తి, మల్లి కేడి అంబాజీ, మాజీ ఉపసర్పంచ్ లు బి నర్సింలు, ఎం ఏ అజీజ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నసీం సుల్తానా, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లావణ్య, ప్రైమర్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లావణ్య ఏఎంసీ చైర్మన్ షాహిన్ బేగం, నాయకులు టి కృష్ణయ్య గౌడ్, ఎండి అబ్బాస్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.