భూపాలపల్లి, మహా :
గణపురం మండలంలోని అప్పయ్యపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన “భూ భారతి – రెవెన్యూ సదస్సు” ను అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడిన అదనపు కలెక్టర్, రెవెన్యూ శాఖ అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులు అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భూ భారతి రెవెన్యూ సదస్సులు కార్యక్రమం ద్వారా ప్రజలకు భూ సమస్యలు పరిష్కరానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు పరిశీలించి రిజిష్టర్ లో నమోదులు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 30








