వరంగల్ మహా;
పేదవాడి సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్న తరుణంలో నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పర్వతగిరి మండలం పరిధిలోని అనంతారం, గోపనపల్లి కొంకపాక ఏనుగల్లు సోమారం , గోరుగుట్ట తండా, మంగవాళ్య తండా, బూరుగుమళ్ళా, నారాయణపురం, రోల్లకల్, వడ్లకొండ గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి శుభాకాంక్షలు తెలిపారు.
గృహం అనేది కేవలం గదుల సముదాయం కాదని అది గౌరవంతో జీవించే హక్కు అన్నారు. ఒక్కో ఇంటికీ రూ.5 లక్షల వరకు మంజూరు చేస్తూ, నిర్మాణ నాణ్యతపై పూర్తి పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అంతేకాకుండా
సోమవారం గ్రామంలో సుమారు 25 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని
ప్రారంభించారు.
కొంకపాక, సోమారం గ్రామ ప్రభుత్వ పాఠశాల పరిధిలోని అంగన్వాడి పాఠశాలలో అంగన్వాడి విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.
పర్వతగిరి మండల పరిధిలోని సోమారం గ్రామపంచాయతీ భవనం నుండి చెరువు ముందు తండా వరకు, సోమారం నుంచి జగ్గు తండా ఎస్ ఆర్ ఎస్ పి కెనాల్ వరకు రహదారి అభివృద్ధి పనులకు ఎస్టి ఎస్డి ఎఫ్ నిధుల ద్వారా రూ.2 కోట్ల 20 లక్షలతో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనలు నిర్వహించారు.
గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మారుమూల తండాల్లోని ప్రజలకు పునాదిరహిత రహదారులు, మౌలిక వసతుల కల్పన త్వరితగతిన జరుగుతుంది. సోమారం తండాకు కొత్త రహదారి నిర్మాణం ద్వారా స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యం, వైద్య-విద్యా సేవలకు వేగవంతమైన చేరిక సాధ్యమవుతుంది అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, మండలాధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్, మహిళా నాయకులు తొర్రి పద్మా యాదవ్, మాసాని సువార్త, ఎంపీడీవో శంకర్ నాయక్, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, లబ్ధిదారులు, అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.








