ఆదిలాబాద్, మహా
ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న హైద్రాబాద్ లో చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అయన మాట్లాడుతూ అడవుల్లోని ఖనిజ సంపదను దోచుకోవడానికి సర్కార్ పెద్దలు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
Post Views: 73








