ఆదిలాబాద్, మహా:
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ధనసరి సీతక్కనే యధావిధిగా కొనసాగించాలని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ నేతలు డిమాండ్ చేశారు. స్థానిక కొమురం భీం కాలనీలో ఆదివాసీలతో కలిసి ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
గోడం గణేష్ మాట్లాడుతూ ఆదివాసి మహిళలు రాజకీయాల్లో జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ధనసరి సీతక్క అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి మన్ననలు పొందుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో పాటు ఆదివాసి చట్టాలు, హక్కులు, సమస్యలపై పూర్తిగా అవగాహన ఉండి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రిగా సీతక్కను మార్చడం ఆదివాసులను అవమానపరచడమే అవుతుందన్నారు. అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధిని ప్రభుత్వం కోరుకుంటే సీతక్కను తిరిగి ఇంచార్జ్ మంత్రిగా నియమించాలన్నారు.








