Mahaa Daily Exclusive

  మేం లోకల్ పర్మిషన్ ఎందుకు.? అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు…? అడ్డగా మారిన ఆదిభట్ల మున్సిపాలిటీ రాజకీయ నాయకుల అండదండలు.? ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఆదిభట్ల మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను, అధికారులు అడ్డుకోవాలని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్, మంగళపల్లి, ఆదిభట్లలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. మున్సిపాలిటీ నుంచి G+2 పరిమితి అనుమతులు మాత్రమే ఉండగా, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ G+4,5 అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు…
మున్సిపాలిటీకి చెందిన కొందరు వ్యక్తులు అధికార పార్టీని అడ్డం పెట్టుకొని, అడ్డగోలు నిర్మాణాలు చేపడుతున్నారని, ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే అదునుగా చూసుకొని మరికొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.

రాజకీయ నాయకుల అండదండలు ఉంటే?
మున్సిపాలిటీలో అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను నిలువరించడానికి వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురవుతుంది. మంగళపల్లి, ఆదిభట్ల అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, కొందరు మాత్రం బహుళ అంతస్తులు నిర్మించుకోవచ్చు? మేము మాత్రం నిర్మించరాదా? అధికారంలో ఉన్న ప్రముఖుల అండదండలు ఉంటే, వారికి ఒక న్యాయం? మాకు ఒక న్యాయమా? అంటూ అధికారులను, బిల్డర్లు నిలదీస్తున్నారు. దీంతో ఏమి తోచని స్థితిలో అధికారులు అక్రమ నిర్మాణాలను నిలువరించలేక పోతున్నారు.

డ్రైనేజ్ వ్యవస్థనేలేని వెంచర్లో బహుళ అంతస్తులు…?
మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను అధికారులు అడ్డుకోవాలని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళపల్లి, ఆదిభట్ల గ్రామాల రెవెన్యూ పరిధిలో చేపట్టిన వెంచర్లల్లో, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, రోడ్లు, విద్యుత్ సరఫరా వంటివి లేకపోవడం, పరిమితికి మించి చేపడుతున్న భవనాల నుంచి వచ్చే వ్యర్ధాలు రోడ్డుపై ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇలాగే అక్రమ నిర్మాణాలు చేపడితే మరుగునీరు అంతా రోడ్డుపై పారడం జరుగుతుందని దీంతో దుర్వాసన రావడం విష జ్వరాలు ప్రబాలించడం జరుగుతుందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వాటికి తావు లేకుండా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Latest