Mahaa Daily Exclusive

  భద్రకాళీ చెరువు పూడిక తీత పనుల్లో అవినీతి జరగలేదు బహిరంగకు చర్చకు సిద్దమన్న ఎమ్మెల్యే నాయిని ..!

Share

హన్మకొండ మహా;

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి గురించి బిఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని
అన్నారు. గతంలో
మేము మా హయాంలో ఎంత తినాలో అంత తింటాము కానీ ఎవరు అడగొద్దని వాళ్ల పార్టీ నేతలే
ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని వారే అంటారు. నిజమైన దయ్యాలు ఎవరో ప్రజలకు తెలుసునని అన్నారు.
కార్పొరేషన్ నుంచి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా 50 కోట్ల నిధులను విడుదల చేసిన సంగతి అప్పుడే మర్చిపోయారా.
భద్రకాళి అమ్మవారికి అన్ని చేశాము అనే నేతల్లారా మీ హయాంలో భద్రకాళి అమ్మవారికి ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.
మీ హయాంలో జరిగిన పాపాలను నేడు మా ప్రజా ప్రభుత్వంలో మేము శుద్ధి చేస్తున్నామని
కేటిఆర్ నయిం నగర్ బ్రిడ్జి మీద వరద బాధితులకు ఇస్తానన్న 10 వేలు ఏమాయే అని
జైలుకు పోయే ముందు విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
అభివృద్ధి కోసం వేసిన ప్రతి టెండర్ పక్రియ తెరచిన పుస్తకమే అని
మీ హయాంలో 25 % వసూలు చేసిన మీరు నేడు మా ప్రభుత్వాన్ని నిందించడం అంటే
దొంగలే దొంగ దొంగ అంటున్నట్టు గా ఉందని ఎద్దేవా చేశారు.
32 కేసుల్లో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఇంకా మీకు తెలిసి రాలేదు.
పని లేనట్టుగా రాష్ట్ర
ముఖ్యమంత్రి ని విమర్శించడమే తప్ప ప్రజలకు మీ హయాంలో చేసిన అభివృద్ధి ఎంటో చెప్పలేని స్థితిలో మీరు ఉన్నారు.
మేము కక్ష్య సాధింపు చర్యలకు దిగితే మీరు మీ నాయకులు ఎవ్వరు బయట తిరగలేరని
మీ చరిత్ర ఎంటో ప్రజలకు తెలిసే మిమ్మల్ని పక్కన పెట్టారని గుర్తు చేశారు. భద్రకాళి
చెరువు అభివృద్ధిలో ఆన్లైన్ ద్వారా e టెండర్ విధానం ద్వారానే ఎంపిక జరిగిందని అర్హతకలిగిన వారికే టెండర్లు ఖరారు అవుతాయనే కనీస అవగాహన లేని స్థితిలో మీరు ఉన్నారని
భద్రకాళి అమ్మవారి చెరువు మట్టి తరలింపులో పూర్తి స్థాయి ఉచితంగా అందుబాటులోని రైతులకు, స్మశాన వాటికలకు అందజేస్తున్నామని తెలిపారు.
వరంగల్ అభివృద్ధిలో మీ పాత్ర ఏంటో కేటిఆర్ నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.
భద్రకాళి చెరువు గతంలో ఉన్న విస్తీర్ణంతో పనులు జరుగుతున్నాయని తప్ప ఎటువంటి స్థాన చలనం జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
గతంలో చెరువులో ఉన్న చిన్న చిన్న గుట్టల ప్రాంతాలల్లో మట్టి పోసి ఐలాండ్ లాగా మారుస్తున్నామని
మీ 10 పదేళ్ల హయాంలో బొంది వాగు పట్టించుకోకపోతే సుమారు 160 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
భద్రకాళి అమ్మవారి ముక్కు పుడుక నుంచి ప్రతి వస్తువు పై చిత్త శుద్ధితో ఉన్నామని
మీ హయాంలో జరిగిన బాగోతాలకు అమ్మవారే మిమ్మల్ని శిక్షించిందని అన్నారు. అంతేకాకుండా
వడ్డేపల్లి రైతులను భూములను లాక్కోవాలని చూసిన నువ్వు ఈ రోజు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.

Latest