మహా: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కూసుమంచిలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన స్వయంగా అరక పట్టి చేల్లో అచ్చు తోలిన అనంతరం మహిళా కూలీలతో కలిసి పత్తి గింజలను నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రైతును రాజు చేయాలనేదే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా ప్రభుత్వం రైతులను ప్రోత్సాహిస్తోంది. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతులకు రూ.17000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే,మన ప్రభుత్వం 18 నెలల్లో నే రూ 21000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. నాణ్యమైన విత్తనాలు,ఎరువులు ఇబ్బంది లేకుండా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గత ప్రభుత్వం వారి స్వార్థం కోసం ప్రాజెక్టులు మొదలు పెట్టి అర్ధాంతరంగా వదిలేస్తే వాటిని పూర్తి చేస్తూ సాగు నీటిని అందిస్తాం. వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి పెట్టుబడి కోసం 12 వేలు ఇస్తాం. రైతు భరోసా ఇప్పటికే రెండు సార్లు ఇచ్చాం, నేటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం.. కాళేశ్వరం కూలినా కూడా దేశంలో అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా మనం మొదటి స్థానంలో ఉన్నాం. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోంది’ అని తెలిపారు.








