Mahaa Daily Exclusive

  నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన ..!

Share

మహా: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని చెప్పారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయన్నారు. స్థానిక ఎన్నికలపై నేటి కేబినెట్ సమావేశంలో చర్చించాక ఎన్నికల తేదీ పై స్పష్టత ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తయిన తర్వాత… వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంచాయన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్న నేపత్యంలో… గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని సూచించారు.
ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు..
గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. నాయకులు నేతలు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎన్నికలు రావడానికి మరో 15రోజుల గడువు మాత్రమే ఉందని అన్నారు. కాబట్టి ఆయా గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం అవ్వాలని సూచించారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట నుంచి ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. సన్నాలకు రైతు బోనస్ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదేనని చెప్పారు. మీ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదని.. వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా నాయకులే తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరారు.

Latest