ఆదిలాబాద్, మహా:
పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీ సీ బీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రజా సేవ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాజీ మంత్రి జోగురామన్న చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా భోజారెడ్డి మాట్లాడుతూ….నిరుపేదలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు మహిళలకు ఉచిత బస్సు, రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ, అయిదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే ప్రజలకు అన్ని విధాలా న్యాయం చేసేలా పాలన కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
Post Views: 78








