ఆదిలాబాద్, మహా:
సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ నేరగాళ్ల వద్ద మోసపోయి… జిల్లా పోలీసు యంత్రాంగం సహాయంతో తిరిగి డబ్బులు అందుకున్న బాధితులు సోమవారం ఎస్పీని శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయిన బాధితులకు సత్వర న్యాయం అందచేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ బాధితులు వెంటనే 1930కి సంప్రదించడం వల్ల మోసపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎస్పీ తెలిపారు. గత నెల రోజులలో జిల్లా పోలీసు యంత్రాంగం దాదాపు పది కేసుల లో కోర్టు ద్వారా అందరి బాధితులకు లక్ష రూపాయల వరకు నగదు తిరిగి అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బి సురేందర్రావు, సైబర్ క్రైమ్ ఇంచార్జ్ ఏసుదాస్, సిబ్బంది కె సాయి శివ, అబ్దుల్ ఆహాద్, వై సంతోష్ తదితరులు పాల్గొన్నారు.








