Mahaa Daily Exclusive

  ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం ఎమ్మెల్యే నాయినిరాజేందర్ రెడ్డి..!

Share

హన్మకొండ మహా;

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్ లోని లష్కర్ సింగారంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరైయ్యారు. అర్హులైన లబ్దిదారుల ఇళ్లకు భూమి పూజ కార్యక్రమం చేసి, పనులను ప్రారంభించారు.నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్థితిగతులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా అద్దె గృహాల్లో ఉంటున్న మాకు సొంత ఇల్లు సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి,ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బాబాయ్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు అజీజ్ ,రహీమున్నీసా నాయకులు ఎర్ర మహేందర్,మట్టెడ అనిల్ కుమార్,శ్యామ్,రేణికుంట ప్రవీణ్,సత్తార్,కాసిం,ఎర్ర చందు ,రజిత్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.