Mahaa Daily Exclusive

  మంత్రి కొండా సురేఖ, మేయర్ లను కలిసిన బల్దియా కమిషనర్..!

Share

వరంగల్ మహా;

బల్దియా కమిషనర్ గా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్ పాయ్
సోమవారం ఆర్ అండ్ గెస్ట్ హౌస్ లో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ను మర్యాదపూర్వకం గా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మేయర్ ఛాంబర్ లో నగర మేయర్ గుండు సుధారాణి ని బల్దియా కమిషనర్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించగా మేయర్ కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు నగరాభివృద్ధి, బల్దియా కార్యకలాపాలపై కాసేపు చర్చించారు.