Mahaa Daily Exclusive

  ప్రజావాణికి 68 ఫిర్యాదులు సమస్యలు పరిష్కరిస్తాం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (68) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ శాఖ– 30 , ఇతర శాఖలకు – 38, మొత్తం 68 దరఖస్తులు అందాయి. అనంతరం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా అధికారులతో మాట్లాడుతూ… వర్షాకాలంలో కురుస్తున్న వర్షాలకు వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.