హన్మకొండ మహా;
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు సత్వర పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు అందించిన అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.
ప్రజలు అందించిన అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, భూ రికార్డులు సర్వే, విద్యుత్, మున్సిపల్, విద్య, పోలీస్, సాగునీటిపారుదల, ఆర్ అండ్ బి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, వైద్య ఆరోగ్య, కుడా, ఉపాధి కల్పన, వ్యవసాయ శాఖ, మైన్స్, కోశాధికారి, తదితర శాఖలకు సంబంధించి 145ఊ అర్జీలను ప్రజలు అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కె. నారాయణ, సిపిఓ సత్యనారాయణ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.








