వరంగల్ మహా;
దుకాణదారులు చెత్త ను మున్సిపాలిటీ చెత్త తీసుకువెళ్లే ట్రాక్టర్ లకే అందించాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు.
సోమవారం నగర పరిధి లోని 28 వ డివిజన్ వరంగల్ బట్టల బజార్ ప్రాంతం లోగల వెంకటేశ్వర ఆలయం సమీపం లో మేయర్ క్షేత్ర స్తాయి లో పర్యటించి సమర్థవంతం గా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కమర్షియల్ దుకాణదారులు చెత్తను బల్దియా నిర్వహించే చెత్త ట్రాక్టర్ లకే అందించాలని చెత్త ను ఇవ్వని షాపు ల సమాచారం సేకరించాలని చెత్త ను బహిరంగం గా ఆరుబయట , డ్రైన్ లలో వేసే వారికి పెనాల్టీ లు విధించాలని మేయర్ అధికారులను ఆదేశించారు.
మేయర్ వెంట ఏం హెచ్ ఓ డాక్టర్ రాజేష్ , సానిటరీ సూపర్ వైజర్ భాస్కర్, తదితరులు, పాల్గొన్నారు.
Post Views: 90








