Mahaa Daily Exclusive

  బల్దియా ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు సెంచరీ దాటిన ఫిర్యాదులు.. పరిష్కారం కోసం పడిగాపులు దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్..!

Share

వరంగల్ మహా;

బల్దియా లో సోమవారం నిర్వహించే ప్రజావాణికి ప్రజల నుంచి భారీగా వినతులు వెల్లువెత్తాయి. గతంలో స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సరైన సమయంలో పరిష్కరించక చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. మళ్లీ కొత్తగా వచ్చిన వినతులు సెంచరీ దాటాయి.
ఈ సందర్భంగా బల్దియా కమిషనర్
ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని
జిడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు.
బల్దియా ప్రధాన కార్యాలయం లోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్ పయ్
ప్రజల నుండి దరఖాస్తు లను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు.
అనంతపురం కమిషనర్ మాట్లాడుతూ… ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను మానవతా దృక్పథంతో క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కార దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. వినతులు పెండింగ్ లో ఉండకుండా ఏ వారానికి ఆ వారం క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి లో స్వీకరించిన ఫిర్యాదుల వివరాలు విభాగాల వారిగా
1.ఇంజనీరింగ్….26
2.హెల్త్ & సానిటేషన్…..09
3.ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)…09
4.టౌన్ ప్లానింగ్…58
5.మంచినీటి సరఫరా……05
6.హార్టికల్చర్…..02
7.ఎలక్ట్రికల్. ….02

మొత్తం…. 111గా అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆదనవు కమిషనర్ జోనా, సి ఎం హెచ్ ఓ డా.రాజారెడ్డి, సెక్రటరీ అలీ వేలు ఇన్చార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, హెచ్ ఓ లు రమేష్ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్ రచిందర్, ఏం హెచ్ ఓ డా.రాజేష్ టి ఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.