Mahaa Daily Exclusive

  రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారు ఆయనకు జైలుకు వెళ్ళాలన్న కుతూహలం ఉంది : మంత్రి సీతక్క

Share

హైదరాబాద్, మహా

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు జైలుకు వెళ్లాలని కుతూహలంగా ఉన్నట్లు కనిపిస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. వీలైనంత త్వరగా జైలుకు వెళ్లేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ రెచ్చగొడుతున్నారని సీతక్క అన్నారు. “కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లివచ్చి బీసీ ఎజెండాను అందుకున్నారు. తాను వెనుకబడ్డాననే భావనతో కేటీఆర్ కూడా జైలుకు వెళ్లి ఏదైనా పథకం రచించాలని అనుకుంటున్నారేమో” అంటూ వ్యంగ్యంగా అన్నారు. కేటీఆర్ మాటల్లో పొగరు కనిపిస్తోందని ఆమె మండిపడ్డారు. ఏదో ఆశించే కేటీఆర్ జైలుకు వెళ్లాలని అనుకుంటున్నారని, తోడేళ్లలా దోచుకుని ఇప్పుడు వినయం నటిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. “కేటీఆర్ పొగరుతో మాట్లాడుతుంటే, తమ ముఖ్యమంత్రి పౌరుషంతో మాట్లాడుతున్నారు” అని సీతక్క వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయని ఆమె స్పష్టం చేశారు.