Mahaa Daily Exclusive

  ప్రభుత్వ సౌకర్యాలు వినియోగించుకోవాలి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి..!

Share

ఆదిలాబాద్, మహా
ప్రభుత్వ విద్య సంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యా శాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. పట్టణంలోని భవిత విలీన విద్యా వనరుల కేంద్రంలో మంగళవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా విలీన విద్యా దినోత్సవం, బాలిక విద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ బాలిక విద్య ప్రాముఖ్యతను, సీడబ్లూఎస్ఎన్ పిల్లలను పాఠశాలల్లో చేర్పించాల్సిన బాధ్యతలు, వారికి విద్య అందించాల్సిన ఆవశ్యకత గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అనంతరం పిల్లలతో అక్షరాభ్యాసం చేయించి భవిత కేంద్రంలో అడ్మిషన్ చేయించారు. ఏడవ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలను పై తరగతి కోసం వివిధ పాఠశాలల్లో ప్రవేశం కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓ సోమయ్య, సెక్టోరల్ అధికారులు సుజాత్ ఖాన్, తిరుపతి, శ్రీకాంత్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లచ్చిరాం, ఎన్జీవో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, భవిత కేంద్రం ఐఈఆర్పీలు పుష్పవేణి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.