వరంగల్ మహా;
వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గానికి ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడంతో నేడు వర్ధన్నపేట పట్టణ కేంద్రం లోని గువ్వల బోడు కి చెందిన ప్రభుత్వ భూములను మంగళవారం ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్స్ఫిక్ కోర్టు, సబ్ జైలు, సబ్ డివిజన్ కోసం అనువైన స్థలాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
సుదీర్ఘ కాలంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి పరిపాలన చేసిన కూడా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదని, నియోజకవర్గంలో అనువైన స్థలం లేదని దాటవేసి ప్రభుత్వ విద్యాసంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోయారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడి పోయిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. నేను నాయకుడిని కాదు సేవకుని అని నిరూపించు కోవడానికి సమయం ఆసన్నమైందని, వర్ధన్నపేట పట్టణ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల ఇంటిగ్రేటెడ్ స్కూల్, ద్వారా నిజం కానుండటంతో వారి ఆనందానికి అవధులు లేవని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా విద్యా రంగానికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని కొనియాడుతూ నియోజకవర్గ ప్రజలు, నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా స్థానిక దళిత, గిరిజన రైతులు తమ భూములు ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరమని వారందరికీ ఎమ్మెల్యే నాగరాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా
గువ్వల బోడు ప్రాంతం పాఠశాల నిర్మాణానికి అత్యంత అనుకూలంగా ఉందని, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలకు చేరుకోవచ్చని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమై, పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.
అనంతరం….
మృతుడు మెరుగు రాజేష్ కుటుంబానికి పరామర్శ
వర్ధన్నపేట మండల పరిధి లోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన మెరుగు రాజేష్ ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించగా ఎమ్మెల్యే నాగరాజు మంగళవారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే వెంట టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏపీ రాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.








