Mahaa Daily Exclusive

  వరంగల్ జిల్లా జర్నలిస్ట్స్ పిల్లలకు ఫీజు రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ వరంగల్ జిల్లా కలెక్టర్, డీఈఓ కు కృతఙ్ఞతలు తెలిపిన టీఎస్ జేయూ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్స్ పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని టీఎస్ జేయూ వరంగల్ జిల్లా నాయకులు ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ను కోరగా తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ని కల్పించాలంటూ వరంగల్ జిల్లా డిఈఓ కు తెలియపరచగా వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం వరంగల్ జిల్లా డీఈఓ ఎం జ్ఞానేశ్వర్ జర్నలిస్ట్స్ పిల్లలకు ప్రత్యేక రాయితీ కల్పిస్తూ ప్రొసీడింగ్ కాపీని టీఎస్జేయు (TSJU) నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా టీఎస్ జేయు వరంగల్ జిల్లా నాయకులు వరంగల్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్స్ పిల్లలకి ప్రైవేట్ పాఠశాలలో 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ ప్రొసీడింగ్ కాపీని ఇవ్వడం పట్ల వరంగల్ జిల్లా కలెక్టర్ కు అలాగే డీఈఓ కు కృతజ్ఞతలు తెలిపారు.