వరంగల్ మహా;
శానిటేషన్ నిర్వహణలో అలసత్వన్ని వీడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.
మంగళవారం వరంగల్ నగర పరిధిలోని 25, 26 డివిజన్ లలో చార్ బౌలి ప్రాంతం లో కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి సానిటేషన్ నిర్వహణను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను కమిషనర్ తనఖి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జవాన్ లు, సిబ్బంది మాన్యువల్ గా సంతకాలు చేయడంతో పాటు బయోమెట్రిక్ హాజరు కూడా ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం విధులకు హాజరై, వెళ్లేటప్పుడు నమోదు చేయాలని , అటెండెన్స్ నమోదులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే వేతనాల చెల్లింపు జరుగుతుందని తెలిపారు.
వందరోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఎల్లమ్మ గుడి వద్ద గల చౌరస్తా నుండి చార్ బౌలి వాటర్ ట్యాంక్ వరకు నిర్వహించిన ర్యాలీలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కలియతిరిగిన కమిషనర్ స్థానికులతో మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రక్షిత చర్యలు తీసుకోవాలని, కార్పొరేషన్ సిబ్బందికి సహకరించాలని, తడి పొడి చెత్తను వేరుగా అందజేయాలని అవగాహన కల్పించి ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి అందజేస్తూ, స్టిక్కర్ లను గృహాలకు అతికించి, స్వచ్చ ప్రతిజ్ఞ లో పాల్గొన్నారు. చార్ బౌలి వాటర్ ట్యాంక్ ఆవరణలో నిర్వహిస్తున్న డి ఆర్ సి సి సెంటర్ తో పాటు నర్సరీనీ పరిశీలించి నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ ను సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించిన కమిషనర్ ప్లాంట్ సామర్ధ్యాన్ని పెంచడంతోపాటు మరింత బలోపేతం చేస్తూ మరో ప్లాంటు ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాలిన సురేష్ , సి.ఎం.హెచ్.ఓ డా.రాజారెడ్డి, ఇంచార్జి ఎస్ ఈ, సి పి లు శ్రీనివాస్, రవీందర్ రాడేకర్, వెటర్నరీ డాక్టర్ డా.గోపాల్ రావు, ఏం హెచ్ ఓ డా.రాజేష్, ఏ సి పి ఖలీల్, సానిటరీ సూపర్ వైజర్ భాస్కర్, ఏ ఈ లు మొజామిల్, హబీబ్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్, తదితరులు, పాల్గొన్నారు.








