వరంగల్ మహా;
అభాగ్యులకు అండగా నిలిచి ఎంతోమంది పేదవారి పిల్లల చదువులకు ఆర్థిక సాయాన్ని అందిస్తూ నిరుపేదలను ఆదుకుంటున్న వాక్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం. అనుకోకుండా
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఉప్పుల నవదీప్ స్రవంతి దంపతుల పిల్లల చదువులకు గత మూడు సంవత్సరాల క్రితం వాగ్దానం చేసిన విధంగా ఆ పిల్లలకు, ఈ సంవత్సరం కూడా చదువుల నిమిత్తం 24,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని శుక్రవారం పిల్లల పెద్దనాన్న ఉప్పుల బాలు కు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాక్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వన్నాల వెంకటరమణ చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్, గిరిశెట్టి రోహిత్, జగన్, అపురూప రజినీష్ నేత, రతన్ నోముల, కుచన క్రాంతి, మండ్లోజు జగన్, పట్టణ స్వర్ణకారసంఘం ప్రధాన కార్యదర్శి కట్ట రాజేందర్, వంగల శ్రీనివాస్, బాలు, శ్రవణ్, ముత్తినేని లక్ష్మణ్ , వంగల శ్రీనివాస్ తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.








