Mahaa Daily Exclusive

  ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలి రోడ్డు భద్రత-ట్రాఫిక్ నియమాల పై అవగాహన సదస్సు …!

Share

హన్మకొండ మహా;

వరంగల్ పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు శనివారం హనుమకొండ ట్రాఫీక్ పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత-ట్రాఫిక్ నీయమాల గురించి శుభం గార్డెన్ లో అవగాహన సదస్సు నిర్వహించారు‌. ఈ కార్యక్రమానికి అడిషనల్ డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ (L and O, Traffic) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆటోడ్రైవర్ యూనిఫామ్ ధరించాలని, ఆటో నడపటానికి అవసరమైన పత్రాలు కలిగి ఉండాలని, మద్యం తాగి ఆటో నడపవద్దని, ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలని , ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, పరిమితి కి మించి అధిక వేగంతో ఆటో నడపవద్దని, అధిక ప్రయాణికులతో ప్రయాణం చేయద్దని , నిర్దేశించిన ప్రదేశం లోనే ఆటోలు పార్కింగ్ చేయాలని సూచించారు. అలాగే ఏదైనా నేర సమాచారం ఉంటే ఆ సమాచారాన్ని పోలీస్ వారికి తెలియపరచాలని, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వరంగల్ ట్రాఫిక్ ఏసిపి టి . సత్యనారాయణ, జి సీతారెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హనుమకొండ , ఎస్ ఐ లు కొమురెల్లి , నారాయణ, సిబ్బంది తో పాటు సుమారు 600 వందల మంది ఆటోడ్రైవర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు.