Mahaa Daily Exclusive

  ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వానికి నివేదిక రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు వైద్య విద్య కళాశాలలకు ఎన్ఎంసి నిబంధనల మేరకు సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, తెలంగాణ ప్రభుత్వం నియమించిన కేఎంసి, నర్సంపేట, జనగామ వైద్య కళాశాలల పర్యవేక్షణ కమిటీ ఛైర్పర్సన్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. శనివారం నర్సంపేట మెడికల్ కళాశాలలో వరంగల్, జిల్లా కలెక్టర్
డాక్టర్ సత్య శారదతో కలసి పిన్సిపాల్ మరియు కోఆర్డినేటర్ డాక్టర్ మోహన్ దాస్, వివిధ విభాగాధిపతులు, అనుబంధ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్తో ఆస్పత్రి వసతుల కల్పనకు కావలసిన వివిధ అంశాల పై కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ముందుగా నర్సంపేట మెడికల్ కళాశాలలో బోధన, బోధనేతర, ల్యాబ్, సిబ్బంది, కావాల్సిన వసతులపై సమీక్షించారు. వైద్య విద్యార్థినుల వసతి గృహాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి వాటిని గురించిన వివరాలను ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ ను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిఎమ్సి నర్సంపేట లో ఉన్న ఆసుపత్రిలోని పలు విభాగాలను జిల్లా కలెక్టర్, వైద్యాధికారులతో కలిసి కమిషనర్ సందర్శించి అక్కడున్న వనరులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిని సందర్శించి ఓపి విభాగం, ఆరోగ్యశ్రీ, సందర్శించి ఆయా వార్డుల వివరాలు, ఓపి సేవలు, రిఫరల్స్, ఫాలో అప్, ఇతర సేవల గురించి, వైద్యులు సిబ్బంది, తదితర వివరాలను వైద్యాధికారులను కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ విభాగాల్లో వనరుల కొరత, యూజీ మెడికల్ ఎడ్యుకేషన్ ఎన్ఎంసి నిబంధన ప్రకారం ఉండాల్సిన, సమకూర్చాల్సిన సౌకర్యాల గురించి కూలంకషంగా చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, సౌకర్యాల గురించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ఇందుకు
కావలసిన పరికరాలు, డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది తో పాటు ఇతర వివరాలు కమిషనర్ వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
వీరి వెంట నర్సంపేట వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ సాంబశివరావు, టీజీఎంఐడిసి ఈఈ ప్రసాద్, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. కిషన్ , వైస్ పిన్సిపాల్ డా లక్ష్మినారాయణ, డా శ్రీదేవి , పలు విభాగాల అదిపథులు, బోధన, బోధనేతర, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు