Mahaa Daily Exclusive

  స్థానిక సమరానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని నాని గార్డెన్ లో ఏర్పాటు చేసిన వర్ధన్నపేట నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ వర్ధన్నపేట
ఎమ్మెల్యే పై తీవ్ర వ్యతిరేకత ఉందని
మూడు సర్వే రిపోర్ట్స్ మనకు అనుకూలంగా ఉన్నాయని
స్థానిక సంస్థల ఎన్నికల్లో భారాస విజయకేతనం ఎగురవేయడం ఖాయమని అన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి అమలు చేయని హామీల పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా
ఇతర పార్టీల నుండి వచ్చే నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి తీసుకోవడం ద్వారా పార్టీ మరింత బలోపేతమై అందరం సమిష్టిగా
రెండు నెలలు అన్ని పనులు పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.
ఇటీవల అధినేత కేసిఆర్ ఎల్కతుర్తి లో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం అయిందని గుర్తు చేశారు. ఈ సభలో కేసిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, వైఫల్యాలను ఎండ కడుతూ చేసిన ప్రసంగంతో పార్టీ శ్రేణులు ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి, కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.