Mahaa Daily Exclusive

  డీసీసీబీ ఉద్యోగుల పిఆర్సి అందిస్తాం! వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
డీసీసీబీ ఉద్యోగుల పిఆర్సి పై తెలంగాణ వ్యవసాయ మంత్రివర్యులతో టీజీకాబ్ పాలకవర్గం భేటీ అయ్యారు. డీసీసీబీ బ్యాంక్ ఉద్యోగుల పే రివిజన్ కమిషన్ (పి.ర్.సి) అంశంపై, శనివారం టీజీకాబ్ పాలకవర్గం సభ్యులు టీజీకాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుని బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మర్యాధపూర్వకంగా కలిసి చర్చించారు.
గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న డీసీసీబీ ఉద్యోగుల పిఆర్సి అంశంపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో త్వరలోనే ఆమోదం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అదే విధంగా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా నిధులను 9 రోజుల వ్యవధిలో 9000 కోట్లు విడుదల చేసినందుకు గాను వారికీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, టీజీకాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ పాలకవర్గం సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సమావేశంలో టీజీకాబ్ డైరెక్టర్లు భోజ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.