Mahaa Daily Exclusive

  కోర్టుతీర్పును అమలుచేయకుండా అన్యాయం చేస్తుండు విలేకరుల ఎదుట బాధితరాలు ఆవేదన..!

Share

కారేపల్లి, మహా : ప్రేమించి పెళ్ళి చేసుకోని వేధింపులకు గురిచేస్తున్న భర్త పై కేసు పెట్టగా మనోవర్తి ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చిందని దానిని అమలు చేయకుండా తన భర్త అన్యాయం చేస్తున్నాడని కారేపల్లి మండలం మాధారంకు చెందిన శైలజా ఆరోపించింది. శనివారం కారేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ మాధారంకు చెందిన ఏనుగు శివయ్య 16 ఏండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడని, మాకు ఒక కుమారుడు కలిగినట్లు తెలిపింది. నాపై అనుమానం పెంచుకున్న భర్త శివయ్య పుట్టిన కొడుకును సైతం కాదన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తాను కోర్టులో భర్తపై కేసు వేసినట్లు తెలిపింది. డీఎన్‌ఏ పరీక్షలో సైతం ఇరువురి కొడుకుగా తేలిందని, దీంతో భార్య, కొడుకు పోషణకు మనోవర్తి చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని బాధితురాలు పేర్కొంది. అప్పటి నుండి మనోవర్తి ఇవ్వక పోవటంతో పాటు మాధారంలో శివయ్య పేరుతో ఉన్న భూమిని సైతం అమ్మకాని పెట్టాడని, మరో మహిళతో సహజీవం సాగిస్తున్నాడని శైలజా ఆరోపించింది. దీనిపై కారేపల్లి పోలీస్‌ స్టేషన్‌ కేసు పెట్టగా పోలీసులు న్యాయం చేసే క్రమంలో మాధారంకు చెందిన కొందరు పెద్దమనుషులు నా భర్తకు వత్తాసు పలుకుతూ పోలీస్‌ స్టేషన్‌ నుండి తీసుకెళ్లారని ఆరోపించింది. శివయ్య పేరున ఉన్న భూమి తమ కుమారుడు పోషణ నిమిత్తం ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేసింది. దీనికి సంబంధించి తహసీల్ధార్‌, పోలీస్‌ స్టేషన్లలో పిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది.