Mahaa Daily Exclusive

  వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాధులు దూరం కస్తూర్భాలో వైద్యశిబిరం..!

Share

కారేపల్లి, మహా : వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దరి చేరవని కారేపల్లి మండల వైద్యాధికారి డాక్టర్‌ బీ.సురేష్‌ అన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీజ ఆదేశాలతో శనివారం కారేపల్లి కస్తూర్భాగాంధి విద్యాలయంలో వైద్య శిబిరం నిర్వహించి విద్యార్ధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా వైద్యాధికారి మాట్లాడుతూ రెండు పూటల స్నానంతో పాటు పొడి దస్తులు వేసుకోవాలని సూచించారు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నారు. దోమలు వ్యాప్తి లేకుండా పరిసరాలు పరిశుభ్రత ఉండాలని దానికి విద్యార్ధుల తోడ్పాటు ఎంతో అవసరమన్నారు. ఈకార్యక్రమంలో విద్యాలయ స్పెషల్‌ ఆఫీసర్‌ జీ.రaాన్సీ సౌజన్య, ఏఎన్‌ఎంలు చందన, సులోచన, సరస్వతి, ఉపాధ్యాయులు స్వాతి, విజయ, మమత ఆశాల ఆదెర్ల దేవకరుణ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.