Mahaa Daily Exclusive

  కోయగూడెం ఓసిని సందర్శించిన సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పోట్రు..!

Share

టేకులపల్లి – మహా :

కోయగూడెం, ఓసి ని సందర్శించిన డైరెక్టర్ గౌతమ్ పోట్రు సందర్శించి వ్యూ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి అక్కడ జరుగుతున్న రోజు వారి బొగ్గు ఉత్పతి రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జి.యం వి.కృష్ణయ్య ని అడిగి తెలుసుకున్నారు. ఓ. సి. పనిచేయున్న సర్ఫేస్ మైనర్ భారీ యంత్రం ద్వారా ఉత్పత్తి ప్రక్రియను, బొగ్గు యొక్క నాణ్యతను పరిశీలించి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, బొగ్గు ఉత్పత్తి మరియు రవాణా రోజు వారి లక్ష్యాలను అధికమించి రవాణాకు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలతో బొగ్గు నాణ్యత సామర్థ్యం ఉత్పతి ఐయే లాగా చూడాలని అలాగే ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలతో బొగ్గు ఉత్పత్తి తీయాలని సూచించారు.
అనంతరం జెకె 5ఓ సీ ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను ఓ. సి. యొక్క కాలపరిమితి గురించి జి.యం. ని అడిగి తెలుసుకున్నారు అక్కడి నుంచి సి. హెచ్. పి. లోని లోడింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి బొగ్గు రవాణా, బొగ్గు యొక్క గ్రేడ్ లను పరిశీలించి నాణ్యమైన బొగ్గును సరఫరాచేయాలనీ అన్నారు. అనంతరం జనరల్ మేనేజర్ కార్యాలయాని సందర్శించారు ఈ సందర్భంగా జియం వి. కృష్ణయ్య గారు పూల మొక్క తో శాలువాతో ఘనంగా స్వాగతించారు. నూతన ప్రాజెక్టు జె. కే ఓ. సి ( పూసపల్లి )మైన్ వివరాలను, వాటి యొక్క రికార్డులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వై. సి ఓ ఏ క్లబ్ లో ఇల్లందు ఏరియా ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో యస్వోటు జియం జాకీర్ హుస్సన్, కోయగూడెం పి.ఓ గోవింద రావు, డీజీఎం పర్సనల్ అజ్మీర తుకారం ఇతర అధికారులు పాల్గొన్నారు.