Mahaa Daily Exclusive

  రైతుసేన ప్రధాన కార్యదర్శి గా ధరావత్ కృష్ణ నాయక్ ..!

Share

టేకులపల్లి – మహా :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల వాసి ధరావత్ కృష్ణ నాయక్ కి రాష్ట్ర రైతు సేన ప్రధాన కార్యదర్శిగా నియమించారు హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన మహాసభలో సేవాలాల్ సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా సంజీవ్ నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ అనుబంధ కమిటీలను నియమించారు. ఇందుకుగాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు మండల ప్రజలు ధరవత్ కృష్ణ నాయక్ కి నియమించడం అందరూ సంతోషం మరియు హర్షం వ్యక్తం చేశారు ధరావత్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ… నాకు ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో అంకితభావంతో జాతి సమస్యల పట్ల అహర్నిశలు రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు పనిచేస్తానని నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్ కి రాష్ట్ర అధ్యక్షులు బానోతు హుస్సేన్ నాయక్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను