Mahaa Daily Exclusive

  శరవేగంగా సాగర్ కాలువ పై పాలేరు యూటీ పనులు…!

Share

కూసుమంచి, జూన్ 28, మహా:

కూసుమంచి మండలం పాలేరు సాగర్ కాలువపై నిర్మాణం చేపట్టిన యూటీ పనులను త్వరగా పూర్తి చేయాలని పాలేరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ లోలేవర్ రమేష్ అధికారులకు సూచించారు. శనివారం పాలేరు కాలువపై యూటీ నిర్మాణ పనులను స్పెషల్ ఆఫీసర్ రమేష్, కూసుమంచి క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరగా పనులు పూర్తయ్యే విధంగా చూడాలి అని ఇరిగేషన్ అధికారులకు తెలిపారు. ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ, డీఈ లతో మాట్లాడారు. వర్షాకాలం వచ్చిందని, వరదలు రాకముందే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.