Mahaa Daily Exclusive

  50 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ..!

Share

హన్మకొండ మహా;

బల్దియా పరిధి 1వ డివిజన్ లోని పలివెల్పుల ప్రాంతం లో కార్పొరేషన్ సాధారణ (జనరల్) నిధుల కింద రూ.100 లక్షల అంచనా వ్యయం తో దుర్గా మాత ఆలయం నుండి పలివెల్పుల వరకు నిర్మించనున్న బీటి రోడ్డు పనులతో పాటు ఎర్రగట్టు గుట్ట మంత్రపురి కాలనీ లో 15 వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.50 లక్షల అంచనా వ్యయం తో చేపట్టనున్న అంతర్గత సి సి రోడ్డు నిర్మాణ పనులకు
ఆదివారం వర్దన్న పేట శాసనసభ్యులు కే ఆర్ నాగరాజు తో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ అరుణ కుమారి, స్థానిక నాయకులు దేవరకొండ అనిల్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు, పాల్గొన్నారు.