రంగారెడ్డి జిల్లా మహా:
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో వార్తలు ప్రచురిస్తున్నారని, అక్కసుతోనే బిఆర్ఎస్ శ్రేణులు మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై దాడులు చేయడం తీవ్రంగా కండిస్తున్నట్లు, కడ్తాల్ మండల జర్నలిస్ట్ సంఘము మండల అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. మీడియా చానళ్ళు ప్రచురించే వార్త కథనాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రజాస్వామ్యంలో స్పందించి తీరు ఇది కాదని, తమపై వచ్చిన ఆరోపణలను మీడియా ముఖంగా ఖండించడం, లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. కానీ మీడియా సంస్థలపై దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఆదివారం అయన కడ్తాల్ పట్టణంలో మాట్లాడుతూ… మీడియాపై దాడులు చేయడం అత్యంత హేనీయమని విమర్శించారు. రాష్టంలో మహా న్యూస్ పై జరిగిన దాడులను ఖండిస్తూ, జర్నలిస్టులు నిరసన చేసే పరిస్థితి ఉందన్నారు.
Post Views: 78








