Mahaa Daily Exclusive

  అంబేద్కర్ సేవా సంఘం నూతన కమిటీ ఎన్నిక కమిటీ నూతన అధ్యక్షులుగా మాదరి శివకుమార్..!

Share

రంగారెడ్డి జిల్లా మహా:
ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ సేవా సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది.
ఆదివారం అంబేద్కర్ సేవా సంఘం నూతన అధ్యక్షులుగా మాదరి శివకుమార్, ప్రధాన కార్యదర్శి లకుమల్ల అరవింద్, ఉపాధ్యక్షులుగా కొలుకులపల్లి శ్రీకాంత్ లను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ… అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన అడుగుజాడలో నడుస్తూ, పలువురికి ఆదర్శంగా నిలిచేలా సంఘాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. బడుగు బలహీన వర్గాల పట్ల, ఆయన చూపించిన మార్గం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్ ఈగల రాములు, భర్తకి జగన్నాధం, దాసరి మురళి కృష్ణ, బండి మహేష్, నూకల అంగత్ కుమార్, భర్తకి రాజు, యంజాల లక్ష్మయ్య, నరేష్, కిషోర్, బస్తి పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.