తల్లాడ, జూన్, 30( మహా):-
తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిహెచ్ఓ గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన గంటే భాస్కర్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి రమేష్ సన్మానించారు. ఆదివారం ఖమ్మం లోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్ లో పదవి విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని భాస్కర్ రావు దంపతులను శాలువాలతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించి తల్లాడ మండలంలో ప్రజలందరితో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించారని, పదవి విరమణ అనంతరం ఆయన శేష జీవితం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.
Post Views: 101








