కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆ పదవి నుంచి తొలగిస్తారంటూ వస్తున్న ఊహాగానాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. సీఎం మార్పుపై తుది నిర్ణయం హైకమాండ్ చేతుల్లోనే ఉందని ఆయన మీడియాకు స్పష్టం చేశారు. “హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు” అని ఖర్గే తెలిపారు. కాగా, సీఎం పదవి మార్పుపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
Post Views: 64








