Mahaa Daily Exclusive

  ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు..!

Share

ఆదిలాబాద్, మహా

న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన స్టాఫ్ రూమ్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. ప్రత్యేక పూజలు జరిపి భవనాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ అందుబాటులో ఉంచిన వసతులను పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ 2023లో కోర్టు ఉద్యోగుల లంచ్ రూం కోసం హై కోర్టు నిధులు విడుదల చేసిందని తెలిపారు. భవనం పూర్తి కావడంతో ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటూ తగిన సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.