దిలాబాద్, మహా
పెండింగ్ లో కార్మికుల వేతనాలను తక్షణమే వారి ఖాతాల్లో జమ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమోల్ల కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా కిరణ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు గత మూడు నెలల నుండి పెండింగ్ వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు అమలుచేయడం లేదని పేర్కొన్నారు. కార్మికుల ఖాతాల్లో ఒకటో తేదీన వారి అకౌంట్ లో వేతనాలు వేస్తామని కార్మికులకు అనేకసార్లు ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.కానీ వారి ఖాతాల్లో ఇప్పటివరకు నయా పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చిన తర్వాత గ్రామాలలో అనేక పనులు చేయిస్తోంది తప్పితే వారి సమస్య లు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న, గ్రామపంచాయతీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అత్రం సోపన్ రావు,వెంకట్రావు, అశోక్, లక్ష్మన్న నాయకులు ఇంద్రాజ్, నరేష్,రాకేష్,విలాస్, ప్రమోద్,శంకర్ గంగన్న, స్వామి, రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.








