కారేపల్లి, మహా : కారేపల్లిలో సోమవారం నూతనంగా శ్రీ కమలాదేవి ఆసుపత్రి ప్రారంభించారు. డాక్టర్ రూపేష్‌కుమార్, ఎండీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆసుపత్రిని సీనియర్ వైద్యులు డాక్టర్ సామినేని రాఘవులు చేతులమీదిగా ప్రారంబించగా, కన్సల్‌టెంట్ రూమ్‌ను విద్యాన్‌విద్యాసంస్ధల అధినేత తాతా శ్రీనివాసరావు ప్రారంబించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కారేపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, విద్యా, వైద్యం విస్తరిస్తుందన్నారు. వైద్యపరంగా స్పెషలిస్టు సేవలు అందుబాటులోకి రావటం శుభపరిణామన్నారు. శ్రీ కమలాదేవి ఆసుపత్రిలో వైద్య సేవలను మండల ప్రజలకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో సూర్యదేవర వెంకటేశ్వర్లు, బీ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 24








