Mahaa Daily Exclusive

  ములకలపల్లి మండలంలో అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు రెండు కోట్ల 68 లక్షలతో పలు పనులు ప్రారంభం..!

Share

ములకలపల్లి, జూన్ 30, మహా: ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి, అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ సోమవారం ములకలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు కోట్ల 68 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ములకలపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన కుట్టుమిషన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదే విధంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులు, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లభించిన ఆర్థిక సహాయాన్ని అర్హులైన బాధితులకు అందించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.