దక్షిణాసియాలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషించిన సార్క్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త గ్రూప్‌ను ఏర్పాటు చేసేందుకు చైనా-పాక్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు పాకిస్థాన్ పత్రిక వెల్లడించింది. ఇటీవల చైనాలోని కున్మింగ్‌లో చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రతినిధుల మధ్య సమావేశం జరగగా, శ్రీలంక, మాల్దీవులు, అఫ్గానిస్థాన్‌లను ఈ కూటమిలో చేర్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాణిజ్యం, అనుసంధానం, ప్రాంతీయ సహకారాన్ని మెరుగుపరచడమే లక్ష్యమని సమాచారం.
Post Views: 91








